దక్షిణ సూడాన్‌కి చేరుకున్న సహాయక అధికారులు
- July 14, 2016
దక్షిణ సూడాన్‌లో అంతర్యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి 500మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ నేతృత్వంలోని సహాయక అధికారుల బృందం భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు దక్షిణ సూడాన్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానాలు రేపు తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్‌పోర్టులకు చేరుకోనున్నాయి. భారతీయుల బృందంలో ఉన్న 54మంది తెలంగాణవాసులు స్వదేశానికి చేరుకోనున్నారు. తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రెసిడెన్స్ కమిషనర్ శశాంక్‌గోయల్ విదేశాంగ, రైల్వే అధికారులతో చర్చిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్లు శశాంక్‌గోయల్ చెప్పారు. రైళ్లు లేదా విమానంలో తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపుతమని తెలిపారు. తిరువనంతపురం చేరుకున్న వారికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







