ఫ్రాన్స్‌లో చెలరేగిన ఉగ్రవాదులు
- July 14, 2016

ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా నరమేధానికి పాల్పడ్డారు. నీస్ నగరంలో బాస్టిల్ డే ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 80 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా వెలుగులను వీక్షిస్తున్న జనాలపైకి ఉగ్రవాదులు అతివేగంతో ట్రక్కును నడిపారు. ట్రక్కులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ట్రక్కు డ్రైవర్ మృతి చెందాడు.ఫ్రాన్స్ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ట్రక్కు దూసుకుపోయిన ప్రాంతంలో కుప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయి. క్షతగాత్రులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిచాయి. మృతులకు ఒబామా సంతాపం తెలిపారు.

తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







