ప్రవాసాంధ్రులకు అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- July 08, 2025
అమరావతి: ప్రవాసాంధ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని..ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై ఎన్నారైల సాధికారిత మరియు సంబంధాల శాఖ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా ఎన్ఆర్ఐల సంక్షేమం, భద్రత, అభివృద్ధి కోసం కృషి చేస్తామని మంగళవారం తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామానికి చెందిన భవనాసి సత్యబాబు కుటుంబానికి “ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం” కింద రూ.10లక్షల పరిహారాన్ని కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) వివిధ దేశాలకు వలస వెళ్ళిన ప్రవాసాంధ్రులకు అన్నివిధాల సహకారం అందిస్తోందని పేర్కొన్నారు.ఉపాధి మరియు ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం వలస వెళ్లి విదేశాల్లో ఉంటున్న తెలుగువారందరూ ప్రవాసాంధ్ర భరోసా పథకంలో రిజిస్టర్ చేసుకోవాలని తద్వారా అనుకోని ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వారి కుటుంబానికి ప్రభుత్వం భరోసాగా ఉంటుందని కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
వివరాల్లోకి వెళితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామానికి చెందిన భవనాసి సత్యబాబు 2014వ సంవత్సరంలో ఉద్యోగ నిమిత్తం సౌదీ అరేబియాకు వలస వెళ్లారు. KEC ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలో కన్స్ట్రక్షన్ మేనేజర్ గా పనిచేస్తూ..సౌదీ అరేబియాలోని APNRTS కో-ఆర్డినేటర్స్ సహాయంతో ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం నందు నమోదు చేసుకున్నారు. 2024 ఏప్రిల్ 5న దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మరణించారు. ఆయనకు భార్య,రెండేళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబసభ్యులు ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రయోజనాలను పొందడానికి సహాయం కోసం ఏపీఎన్ఆర్టీ 24/7 హెల్ప్ లైన్ ను సంప్రదించగా.. వారి అభ్యర్ధనను స్వీకరించిన APNRTS అధికారులు సకాలంలో స్పందించి సంబధిత పత్రాలను సమాచారాన్ని సేకరించి న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీకి సమర్పించడం జరిగింది.అంతే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిథులతో సమన్వయం చేసుకుంటూ బీమా క్లెయిమ్ త్వరగా సెటిల్ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగింది.
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 2025 జులై 8వ తేదీన రూ.10,00,000/- క్లెయిమ్ ను ఆమోదించి, APNRTS ద్వారా పాలసీదారుని భార్య (నామినీ/ బెనిఫిషరీ)కి అందజేశారు.ఈ మొత్తం ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన APNRTS మరియు న్యూ ఇండియా అస్యురెన్స్ కంపెనీకి మృతుని కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీఎస్ సీఈవో, ఏపీ ఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ కానూరి శేషుబాబు కానూరి, ఎన్నారై టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షులు రావి రాధాకృష్ణ, ఎన్నారై టీడీపీ కువైట్ విభాగం అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి, ఏపీ ఎన్ఆర్టీఎస్ మాజీ డైరెక్టర్ రాజశేఖర్ చప్పిడి మరియు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ విజయవాడ డివిజనల్ మేనేజర్ కె.జోసెఫ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!