బీటెక్ అభ్యర్థుల ఉద్యోగ కల్పన కోసం టామ్‌కామ్ ప్లాన్
- July 14, 2016
బీటెక్, ఎంసీఏ తదితర టెక్నాలజీ విద్యనభ్యసించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని స్కిల్డ్, అన్‌స్కిల్డ్ రంగాల్లోని వారికి టామ్‌కామ్ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం సాప్ట్వేర్ రంగాల్లోని వారికీ ఉద్యోగావకాశాలు కల్పించాలని యోచిస్తోంది.అయితే ప్రస్తుతం టామ్‌కామ్ వద్ద అందుకు తగ్గ వ్యవస్థ అందుబాటులో లేదు. దీంతో ప్రత్యేక సాంకేతిక సహకారం అందించాల్సిందిగా ఐటీ విభాగాన్ని కోరింది. ప్రభుత్వ అధీనంలోని టీఎస్ ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల డేటాబేస్ సేకరిస్తున్నా.. ఆశించిన స్థాయిలో సమాచారం సమకూరడం లేదని టామ్‌కామ్ భావిస్తోంది. దీంతో ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకునేందుకు ఐటీ విభాగాన్ని సాంకేతిక సహకారం అందించాలని కోరింది. తద్వారా బీటెక్, ఎంసీఏ వంటి కోర్సులు చదివిన వారి వివరాలు సేకరించి ఐటీ కంపెనీలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. లఘు చిత్రాల రూపకల్పన.. ఉద్యోగాల పేరిట పలు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీంతో యువత మోసాలకు గురికాకుండా ఉండేం దుకు తామే ఒక ప్రత్యేకమైన వేదిక ద్వారా ప్లేస్మెంట్లు కల్పించేందుకు టామ్‌కామ్ కృషిచేస్తోంది. టామ్‌కామ్ ప్రభుత్వ సంస్థ కావడంతో విదేశాల్లోని కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. యువతలో ప్రచారం కల్పించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రకటనలను రూపొందించింది. వీటికి సెన్సార్‌బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో వీటిని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







