తెలుగు మహిళ, బిడ్డ మృతి ఆస్ట్రేలియాలో !
- July 14, 2016
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ, బిడ్డ మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్ గన్నారం గంగాధర్ కోడలు సుప్రజ, ఆరు నెలల బాబు మెల్బోర్న్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. గంగాధర్ కొడుకు శ్రీనివాస్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. భార్య సుప్రజ, కుమారుడితో అక్కడే ఉంటున్నారు. కాగా, శ్రీనివాస్ తల్లి ఇందిర అనారోగ్యంతో ఉండడంతో కోడలు, మనవడి మరణవార్తను తెలియనీయడం లేదు. వార్త తెలియగానే గంగాధర్ ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఆర్మూర్ నుంచి బయలుదేరారు. ఇంతకూ ఏం జరిగింది? అనే విషయంపై కుటుంబీకులకు సమాచారం లేదు. సుప్రజ తండ్రి ఫోన్ చేయగా.. గంగాధర్ హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







