తెలుగు మహిళ, బిడ్డ మృతి ఆస్ట్రేలియాలో !

- July 14, 2016 , by Maagulf
తెలుగు మహిళ, బిడ్డ మృతి ఆస్ట్రేలియాలో !

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ, బిడ్డ మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణం టీచర్స్‌ కాలనీకి చెందిన రిటైర్డు టీచర్‌ గన్నారం గంగాధర్‌ కోడలు సుప్రజ, ఆరు నెలల బాబు మెల్‌బోర్న్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. గంగాధర్‌ కొడుకు శ్రీనివాస్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. భార్య సుప్రజ, కుమారుడితో అక్కడే ఉంటున్నారు. కాగా, శ్రీనివాస్‌ తల్లి ఇందిర అనారోగ్యంతో ఉండడంతో కోడలు, మనవడి మరణవార్తను తెలియనీయడం లేదు. వార్త తెలియగానే గంగాధర్‌ ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఆర్మూర్‌ నుంచి బయలుదేరారు. ఇంతకూ ఏం జరిగింది? అనే విషయంపై కుటుంబీకులకు సమాచారం లేదు. సుప్రజ తండ్రి ఫోన్‌ చేయగా.. గంగాధర్‌ హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com