సచిన్ కు అపూర్వ గౌరవం..
- July 10, 2025
లండన్: లార్డ్స్ మైదానంలో ఉన్న ఎంసీసీ మ్యూజియంలో ఇవాళ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇంగ్లండ్, ఇండియా మధ్య మూడో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో సచిన్ చిత్రపటాన్ని ప్రదర్శించారు. స్టువర్ట్ పియర్సన్ రైట్ ఈ చిత్రపటాన్ని వేశారు. 18 ఏళ్ల క్రితం తీసుకున్న ఓ ఫోటో ఆధారంగా ఆయిల్ పేయింట్స్‌తో దీన్ని వేశారు. ఈ ఏడాది చివరి వరకు మ్యూజియంలో సచిన్ చిత్రపటం ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పెవలియన్‌కు మార్చనున్నారు. గతంలో భారత మేటి క్రికెటర్లు కపిల్‌దేవ్, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్‌సర్కర్ల పోట్రేట్లను కూడా పియర్సన్ వేశాడు.
ఈ సందర్బంగా సచిన్ మాట్లాడుతూ, లార్డ్స్‌లో తన చిత్రపటాన్ని ఉంచడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. 1983లో కపిల్‌దేవ్ వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో.. తొలిసారి లార్డ్స్ స్టేడియాన్ని చూశానని, ఆ సందర్భం తన కండ్లల్లో ఉండిపోయిందని, ఇప్పుడు తన చిత్రపటం లార్డ్స్‌లో ప్రదర్శించడం .. తన క్రికెట్ కెరీర్‌ను గుర్తుకు తెస్తున్నట్లు సచిన్ తెలిపాడు. ఎంసీసీ క్లబ్లో ప్రస్తుతం మూడువేల ఫోటోలు ఉన్నాయి. దాంట్లో 300 వరకు పోట్రేట్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







