సెప్టెంబర్ 24 నుండి తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలు

- July 11, 2025 , by Maagulf
సెప్టెంబర్ 24 నుండి తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24వతేదీ నుండి అక్టోబర్ 2వరకు జరిపించేలా తిరుమల తిరుపతి దేవస్థానం ముహర్తం ఖరారుచేసింది. తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్న దేవదేవుని వాహన సేవలు ఉదయం 8గంటలకు, రాత్రి 7గంటలకు మొదలవుతాయి. అన్ని ప్రత్యేక దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు, దాతల దర్శనాలు కూడా రద్దుచేశారు. బ్రహ్మోత్సవాలకు దేశవిదేశాల నుండి తరలివచ్చే అశేషసంఖ్య భక్తులకు అసౌకర్యం కలగకుండా మాఢవీధుల్లో గ్యాలరీలకు చేరుకునేలా, వాహనాలకు పార్కింగ్ సదుపాయాలు తెలిపే రోడ్డుమ్యాప్ పక్కాగా ఉండేలా చూస్తున్నారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
ఈ ఏడాది వేంకటేశ్వరస్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన చేపట్టాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు, ప్రణాళికాబద్దంగా తీసుకోవాల్సిన భద్రత చర్యలపై గురువారం మధ్యాహ్నం తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 16వతేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తొలి ఘట్టంగా, 23వతేదీ శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగుతుంది. సెప్టెంబర్ 24వతేదీ సాయంత్రం ధ్వజా రోహణం, రాత్రి పెద్దశేషవాహనం, ఐదవరోజు సెప్టెంబర్ 28వతేదీ రాత్రి గరుడసేవ, అక్టోబర్ 1వతేదీ రథోత్సవం, 2వతేదీ చక్రస్నాన మహోత్సవం ముఖ్యమైన ఘట్టాలు.

బ్రేక్ దర్శనాలకు తాత్కాలికంగా విరామం
బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిదిరోజులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయించి మిగిలిన విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దుచేశారు. వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఎఐ భక్తులు, దాతల చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలు రద్దు. విజిలెన్స్ పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ స్థలాలు ఎంపిక పక్కాగా ఉండాలని అదనపు ఇఒ ఆదేశించారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, ఆలయ మాఢవీదుల్లోకి చేరుకునేలా గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్నప్రసాదాల పంపిణీకి కౌంటర్లు, ఇంజనీరింగ్ పనులు, విద్యుద్దీపాలంకరణలు, ఫలపుష్ప ప్రదర్శన ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు శ్రీవారిసేవకు యువతీ యువకలను ఆహ్వానించిమెరుగైన సేవలంది ంచేందుకు కృషి చేయాలని చౌదరి ఆదేశించారు. సెప్టెంబర్ 27వతేదీ రాత్రి నుండి 29వతేదీ ఉదయం 6గంటల వరకు తిరుమల ఘాట్లో ద్విచక్రవాహనాలు నిషేధం..భక్తుల రద్దీకి తగ్గట్లు లడ్డూలు నిల్వవుంచు కోవాలన్నారు.

తిరుమల ఎందుకు శక్తివంతమైనది?
తిరుమల బాలాజీ ఎందుకు అంత శక్తివంతుడు? జ. ఈ కలియుగంలో తన భక్తులకు మార్గనిర్దేశం చేసి వారిని మోక్షం వైపు నడిపించడానికి విష్ణువు తిరుమల బాలాజీ ఆలయంగా అవతరించాడని నమ్ముతారు.

తిరుమల అసలు దేవుడు ఎవరు?
ఆ దేవత స్వయంభు (స్వయంగా వ్యక్తమైన) అని నమ్ముతారు . తిరుపతి విష్ణువు యొక్క ఒక రూపం అని పది పురాణాలు చెబుతున్నాయి. దేవత కూడా 108 దివ్య దేశాలు – వైష్ణవ ఆలయం విష్ణు దేవతల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ దేవత తిరుమలలోని “శిల తోరణం” అంత పురాతనమైనదని నమ్ముతారు.

తిరుమల ఆలయ రహస్యం ఏమిటి?
తిరుమళా ఆలయ రహస్యాలలో అత్యంత ఆసక్తికరమైనది వెంకటేశ్వర స్వామి నిత్యం పెరుగుతున్న వెంట్రుకల పురాణం. నిజమైన మానవ వెంట్రుకలతో తయారు చేయబడిన విగ్రహ వెంట్రుకలు రహస్యంగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈ దృగ్విషయానికి శాస్త్రీయ వివరణ లేదు మరియు ఆలయ మర్మాన్ని పెంచుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com