156 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి..
- July 14, 2016
యుద్ధంతో అట్టుడుకుతున్న దక్షిణ సూడాన్ నుంచి 156 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. సీ-17 సైనిక విమానంలో 156మంది భారత్‌కు చేరుకున్నారు. అక్కడ చిక్కుకుపోయిన 600 మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సంకటమోచన్ చేపట్టిన సంగతి తెలిసిందే. సూడాన్‌లోని జుబా నుంచి వీరు ఈరోజు ఉదయం కేరళలోని తిరువనంతపురం చేరుకున్నారు. భారతీయులను తీసుకొచ్చేందుకు సూడాన్ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా వచ్చారు. భారత్ చేరుకున్న వారిలో ఇద్దరు నేపాలీలు కూడా ఉన్నారు. .కేరళ, తమిళనాడుకు చెందిన ప్రయాణికులను తిరువనంతపురంలో దించిన తర్వాత మిగిలిన ప్రయాణికులతో విమానం దిల్లీ చేరుకుంది. మరికొందరు భారతీయులతో రెండో విమానం జుబా నుంచి బయలుదేరనుంది. కొందరు వ్యాపార అవసరాల దృష్ట్యా అక్కడే ఉండేందుకు మొగ్గు చూపారని.. అయితే ముందు రక్షణ ముఖ్యమని.. వ్యాపారం తర్వాతని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు వీకే సింగ్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







