జనాభా పెరుగుదల పై ఫోకస్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు

- July 11, 2025 , by Maagulf
జనాభా పెరుగుదల పై ఫోకస్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి అతి పెద్ద ఆర్థిక వనరు జనాభానే అని ఆయన స్పష్టం చేశారు. జనాభా విషయంలో గతంలో ఉన్న అపోహలు తొలగిపోతున్నాయని, ఇప్పుడు అధిక జనాభా ఉన్న దేశాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల స్థిరపడుతున్నదని చంద్రబాబు అన్నారు.“అమెరికాలో ఫర్టిలిటీ రేటు కేవలం 1.62% మాత్రమే ఉంది. జనాభా స్థిరంగా ఉండాలంటే కనీసం 2.1% ఉండాల్సిందే. లేకపోతే జనాభా తగ్గుతుంది,” అని వివరించారు.

మన దేశంలో బీహార్ లో ఫర్టిలిటీ రేటు 3 శాతంగా ఉందని, ఏపీలో 1.7 శాతానికి చేరుకుందని చెప్పారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని, ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న దేశాలకు గౌరవం దక్కుతోందని చంద్రబాబు అన్నారు. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) పోటీ చేసేందుకు వీలు లేదనే చట్టాన్ని తాను తీసుకొచ్చానని, ఇప్పుడు జనాభా పెరుగుదలను తానే సమర్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ దేశాలు ఇప్పుడు స్కిల్డ్ మానవ వనరుల కోసం పోటీ పడుతున్నాయని, భారతదేశానికి ఈ విషయంలో పెద్ద అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు పెంచి, యువతను ప్రొడక్టివ్ ఫోర్స్‌గా మార్చుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.చివరిగా, చంద్రబాబు మాట్లాడుతూ, “మన రాష్ట్రంలో జనాభా స్థిరంగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.సమతుల్యతతో కూడిన అభివృద్ధికి ఇది అవసరం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇది కీలకం,” అని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com