టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లో ఉద్యోగాలు...
- July 11, 2025
ముంబై: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖ ప్రైవేట్ కంపెనీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ ఇంటర్వ్యూస్ ద్వారా తమ హైదరాబాద్ కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హోటల్ ఎస్ఎన్ గ్రాండ్, టుక్కుగూడ ,శంషాబాద్ లో జులై 13 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.
ఉద్యోగ వివరాలు: TASL సంస్థలో పెయింట్ షాప్ ఆపరేటర్, అసెంబ్లీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం ఈ ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.
విద్యార్హతలు: ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ITI పూర్తి చేసి ఉండాలి. పెయింటింగ్‌లో నైపుణ్యం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అప్రెంటిస్ శిక్షణ పొందిన యువత కూడా ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
అవసరమయ్యే ధ్రువపత్రాలు:
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో కూడిన రిజ్యూమ్
- విద్యార్హతల సర్టిఫికెట్లు, ITI, ఇతర సంబంధిత కోర్సుల పత్రాలు
- పూర్వ అనుభవ ధ్రువపత్రాలు
- ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ జాయినింగ్, CTC లెటర్స్
- గత మూడు నెలల పే స్లిప్స్/బ్యాంక్ స్టేట్మెంట్లు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి