సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ రిలీజ్..
- July 15, 2016
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి వరుస హిట్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కతున్న మాస్ ఎంటర్ టైనర్ జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాసిన కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోందిజనతా గ్యారేజ్ షూటింగ్ మొదలైన సమయంలోనే ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడిందన్న వార్త ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్నవర్షాల కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతోందని, అందుకే క్వాలిటీ పరంగా వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా తెలిపారు చిత్రయూనిట్. ఇప్పటి వరకు అనుకున్నట్టుగా ఆగస్టు 12న కాకుండా సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలోనటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాలంలోనే భారీగా రిలీజ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







