ఆస్పైర్ సమ్మర్ క్యాంప్ 2025.. పిల్లల కేరింతలతో ప్రారంభం..!!
- July 14, 2025
దోహా: ఆస్పైర్ సమ్మర్ క్యాంప్ 2025 అధికారికంగా ప్రారంభమైంది. పిల్లలు సరదాగా పాల్గొంటున్నారు. ఇంటరాక్టివ్ కార్యకలాపాలతో ఉత్సాహభరితమైన వాతావరణంలో కార్యక్రమం ప్రారంభమైంది. ఆగస్టు 7 వరకు జరిగే ఈ క్యాంప్.. 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్రీడలు, విద్యా , వినోద కార్యకలాపాల సమగ్ర అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది లేడీస్ స్పోర్ట్స్ హాల్లో వారానికి 5 రోజులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది.
ఈ సంవత్సరం కార్యక్రమంలో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఆత్మరక్షణ, జిమ్నాస్టిక్స్, రిథమిక్ జిమ్నాస్టిక్స్ వంటి విస్తృత శ్రేణి క్రీడలు ఉన్నాయి. వీటితోపాటు దోహా అంతటా ప్రముఖ సాంస్కృతిక, వినోద ప్రదేశాలకు ఫీల్డ్ ట్రిప్లతో పాటు రీడింగ్, డ్రాయింగ్‌లో విద్యా వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తారు. వేసవి సెలవుల్లో పిల్లల శారీరక, సృజనాత్మక అభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ఈ శిబిరం కృషి చేస్తుందని ఆస్పైర్ జోన్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!