కువైట్ లో ఆగస్టు 1 నుండి కార్మికులకు కొత్త కనీస వేతనం..!!
- July 14, 2025
కువైట్: కువైట్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం బంగ్లాదేశ్ కార్మికులకు కొత్త జీతం స్కేల్‌ను ప్రకటించింది. ఇది ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. సవరించిన వేతనాలు కువైట్‌కు వచ్చే కొత్త కార్మికులకు మాత్రమే వర్తిస్తాయని, ఇప్పటికే ఉన్న కార్మికులను వర్తించవని వెల్లడించింది. రాయబార కార్యాలయం కార్మిక శాఖ జారీ చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం.. కొత్త కనీస వేతనాలు ఉద్యోగం రకం, కార్మికుడి నైపుణ్య స్థాయిని బట్టి KD 90 నుండి KD 250 వరకు ఉంటాయి. కువైట్‌లో బంగ్లాదేశ్ జాతీయులు మూడవ అతిపెద్ద ప్రవాస గ్రూప్ గా ఉన్నారు. వివిధ రంగాలలో దాదాపు 284,000 మంది వ్యక్తులు పనిచేస్తున్నారు.
కొత్త కనీస వేతనాలు (కొత్త ఒప్పందాలకు మాత్రమే)
గృహ రంగం (ఆర్టికల్ 20):
గృహ కార్మికుడు: KD 120
జనరల్ వర్కర్: KD 120
కుక్: KD 150
డ్రైవర్: KD 150
ప్రభుత్వ ఒప్పందాలు (ఆర్టికల్ 18):
వ్యవసాయ కార్మికుడు, క్లీనర్, జనరల్ వర్కర్: KD 90
డ్రైవర్: KD 120
ప్రైవేట్ రంగం - సాధారణ కార్మికులు (ఆర్టికల్ 18):
వ్యవసాయ కార్మికుడు, షెపర్డ్: KD 120
క్లీనర్, జనరల్ వర్కర్, గార్డ్: KD 90
నైపుణ్యం కలిగిన/వృత్తిపరమైన కార్మికులు (ఆర్టికల్ 18):
మోస్ట్ టెక్నికల్ , పారిశ్రామిక ఉద్యోగాలు: KD 150
ప్రొఫెషనల్ కుక్: KD 250
సవరించిన స్కేల్ గృహ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని కార్మికులను కవర్ చేస్తుందని రాయబార కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!