బాబు బంగారం' ఆడియో, చిత్ర విడుదల తేదీలు ఖరారు
- July 15, 2016
విక్టరీ వెంకటేశ్, నయనతార జంటగా రూపుదిద్దుకుంటున్న 'బాబు బంగారం' ఆడియో, చిత్ర విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఈ చిత్రం ఆడియోను జులై 24న, సినిమాను ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు మారుతి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, అందరి ఆశీస్సులు కావాలని ట్వీట్ చేశారు.తాజాగా ఈ చిత్రం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో వెంకటేశ్ కూరగాయలు మోస్తూ కనిపించారు. ఈ చిత్రంలో వెంకటేశ్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల తర్వాత నయనతార, వెంకటేశ్ జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమిది. పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజి, సోనమ్ బజ్వా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







