ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్..? నిజమెంత…?

- July 16, 2025 , by Maagulf
ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్..? నిజమెంత…?

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలాఖరులో సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  

రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు తన కేబినెట్ లోని ఓ మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వొచ్చు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పవన్ కల్యాణ్ కు అలా బాధ్యతలు ఇవ్వాలనుకుంటే చంద్రబాబు ఇవ్వొచ్చు. 

అయితే రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవిపై ఎలాంటి నిబంధనలు లేవు. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కేవలం రాజకీయ సంప్రదాయంగా ఏర్పడిన పదవి మాత్రమే. అందువల్ల, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఉప ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులలో ఒకరు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టడం అనేది సంప్రదాయం మాత్రమే. అది కూడా ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చట్టం ఈ విషయంలో ఎటువంటి స్పష్టమైన నిబంధనలను నిర్దేశించలేదు.

పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించబోతున్నారనే దాంట్లో వాస్తవం ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు వెళ్లినప్పుడు ఇలా బాధ్యతలు అప్పగించలేదు. ఈసారి కూడా అలాంటి అవకాశం పవన్ కల్యాణ్‌కు ఇస్తారనే సమాచారం లేదు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com