ఆంధ్రప్రదేశ్‌కు విశేష గౌరవం..
- July 16, 2025
అమరావతి: లింక్డ్ఇన్ విడుదల చేసిన “సిటీస్ ఆన్ ది రైజ్ 2025” నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలు విశాఖపట్నం, విజయవాడ స్థానం దక్కించుకున్నాయి. భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రొఫెషనల్ హబ్‌లలో విశాఖపట్నం మొదటి స్థానాన్ని, విజయవాడ మూడవ స్థానాన్ని దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా విస్తరిస్తున్న ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, కెరీర్ అభివృద్ధి అవకాశాలను సూచిస్తుంది.
లింక్డ్ఇన్ ఈ జాబితాను రూపొందించేటప్పుడు ఉద్యోగ వృద్ధి, ప్రొఫెషనల్ వలస, ఆర్థిక చైతన్యం వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది.
తంలో కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే లభ్యమైన అవకాశాలు ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఈ నగరాలు కొత్త ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు మరింతగా ఆకర్షిస్తున్నాయి.
“సిటీస్ ఆన్ ది రైజ్ 2025” జాబితాలో టాప్ 10 నగరాలు
- విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- రాంచీ, జార్ఖండ్
- విజయవాడ, ఆంధ్రప్రదేశ్
- నాసిక్, మహారాష్ట్ర
- రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
- రాజ్‌కోట్, గుజరాత్
- ఆగ్రా, ఉత్తరప్రదేశ్
- మదురై, తమిళనాడు
- వడోదర, గుజరాత్
- జోధ్‌పూర్, రాజస్థాన్
ఏపీకి లాభాలు
విశాఖపట్నం, విజయవాడలకు లభించిన ఈ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, కొత్త వ్యాపార అవకాశాలు మరింతగా లభించేందుకు దోహదం చేస్తుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చి, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!