‘సార్ మేడమ్’ హైలీ ఎంటర్‌టైనింగ్ ట్రైలర్ రిలీజ్
- July 17, 2025
వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, వెరీ ట్యాలెంటెడ్ నిత్యా మేనన్ జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్ మేడమ్’. "A Rugged Love Story" అనేది ట్యాగ్ లైన్. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విదిదలైన ‘సార్ మేడమ్’ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ ‘సార్ మేడమ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ''నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా' అని విజయ్ సేతుపతి డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మధ్య వచ్చే గొడవలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. పెళ్లి చూపులు, పెళ్లి లాంటి బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో మొదలైన ట్రైలర్ 'మమ్మల్నిద్దర్నీ విడదీసేయండి' అని నిత్యామీనన్ చెప్పిన డైలాగ్ తో ఊహించని మలుపు తీసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంది.
పరోటా మాస్టర్ గా విజయ్ సేతుపతి కనిపించిన సీన్స్ నవ్వులు పూయించాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మాస్ యాక్షన్ కూడా ఉండడం మరింత క్యూరియాసిటీ పెంచింది.
విజయ్ సేతుపతి మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ కెమిస్ట్రీ స్పెషల్ హైలట్ గా నిలిచింది.
డైరెక్టర్ పాండిరాజ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ ఫన్, ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. డిఓపి ఎం సుకుమార్ అందించిన విజువల్స్ బ్యూటీఫుల్ గా వున్నాయి.
ఫ్యామిలీ ఎమోషన్, ఫన్, రగ్గడ్ లవ్ స్టొరీ, మాస్ యాక్షన్ తో ‘సార్ మేడమ్’ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ సినిమా జూలై 25న థియేటర్లో విడుదల కానుంది.
నటీనటులు : విజయ్ సేతుపతి, నిత్యా మీనన్, యోగి బాబు, RK సురేష్, చెంబన్ వినోద్ జోస్, శర్వణన్, దీప, జానకి సురేష్, రోషిణి హరిప్రియన్, మైనా నందిని
దర్శకత్వం: పాండిరాజ్
బ్యానర్: సత్యజ్యోతి ఫిలిమ్స్
నిర్మాతలు: సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
సంగీతం: సంతోష్ నారాయణన్
డిఓపి : ఎం సుకుమార్
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ్
ఆర్ట్ డైరెక్టర్: వీర సమర్
కొరియోగ్రఫీ: బాబా బాస్కర్
స్టంట్: కలై కింగ్సన్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..