దేశంలోనే అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా స్విమ్స్: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు

- July 17, 2025 , by Maagulf
దేశంలోనే అత్యుత్తమ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా స్విమ్స్: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు

తిరుపతి: పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు స్విమ్స్ ను స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించారని, స్విమ్స్ దేశంలో అత్యుత్తమ వైద్య సేవా సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు చెప్పారు.ఇందు కోసం టీటీడీ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని, ఏడాదికి రూ.140 కోట్లు అందిస్తూ, ఆసుపత్రి అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని చెప్పారు. 

 స్విమ్స్ లో  గురువారం అత్యాధునిక ఎం.ఆర్.ఐ, సిటీ స్కానర్ లను చైర్మన్ ప్రారంభించారు.

 అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ

- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ. 22.01 కోట్ల విలువైన యంత్రాలను టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర వైద్య క‌ళాశాల‌ (SVIMS)కు  విరాళంగా అందించింది.

-   IOL (Indian Oil Corporation) తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద అత్యాధునిక వైద్య పరికరాలను అందించింది.

విరాళంగా అందించిన పరికరాలు:

- రూ.14 కోట్లు విలువైన  3 టెస్లా ఎమ్‌ఆర్‌ఐ స్కానర్ (కంపెనీ పేరు MAGNETOM Vida) - 1

- 4డి సిటి సిమ్యులేటర్ సిస్టం-రూ.8 కోట్లు (కంపెనీ పేరు SOMATOM go. Sim),- 1 (రేడియోథెరఫీ కోసం ఉపయోగిస్తారు)

- అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ యంత్రాలను స్విమ్స్ లో  ఏర్పాటు చేస్తున్నాం.

•  రాయలసీమలోనే  అతి పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన స్విమ్స్ లో మాత్రమే అత్యాధునికి యంత్రాలు ఏర్పాటు.  

•  కేన్సర్ రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్స్ లేకుండా క్యాన్సర్ గడ్డను సులువుగా గుర్తించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయి.
 
•  మెదడు సంబంధ, క్యాన్సర్ గడ్డల గుర్తింపు, క్యాన్సర్ వ్యాధి ఏ ఏ అవయాలకు ఎంతెంత మోతాదులో ప్రాకిందో గుర్తించవచ్చు.

•  సంవత్సరానికి 2.5 లక్షల మందికి పైగా పేద రోగులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ యంత్రాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఈ సందర్భంగా ఐఓసిఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, సంస్థ సామాజిక ‌సేవా కార్యక్రమాల్లో భాగంగా స్విమ్స్ కు ఈ వైద్య పరికరాలను అందించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని మాట్లాడారు. 

స్విమ్ డైరెక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ,టిటిడి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా అత్యుత్తమ సేవలందిస్తున్నారు.శ్రీ పద్మావతీ వైద్య కళాశాలలో విద్యార్థినిలకు అత్యుత్తమ వైద్య విద్యను బోధిస్తున్నామన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ గారు దివ్య ఆశీస్సులతో ప్రారంభమైన స్విమ్స్ అంచెలంచెలుగా ఎదిగి మహావృక్షంగా రూపాంతరం చెందుతోందన్నారు. 

అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో విద్యార్థులు,డాక్టర్లతో చైర్మన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు హరిదీప్ సింగ్ పూరి విద్యార్థులను, డాక్టర్లను ఉద్దేశించి ఉపన్యసిస్తూ టిటిడికి చెందిన స్విమ్స్ కు ఐఓసిఎల్ సంస్థ  సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విరాళం అందించడం సంతోషకరమని మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ ను,ఐఓసిఎల్ ప్రతినిధులను స్విమ్స్ డైరెక్టర్ సన్మానించారు.ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మన్ మరియు బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్.ఆర్) ముకేష్ రాజన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి, ఐఓసీఎల్ ప్రతినిధులు దత్తాత్రేయ,బద్రినాథ్, ఇతర ప్రముఖులు, ఇతర వైద్యులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com