‘గరివిడి లక్ష్మి’గా ఆనంది ఫస్ట్ లుక్ రిలీజ్
- July 18, 2025
ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునే ఆనంది తన అప్ కమింగ్ మూవీ ‘గరివిడి లక్ష్మి’లో అద్భుతమైన పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఒక డీప్ కల్చర్ ని ప్రజెంట్ చేయబోతోంది. అర్థవంతమైన సినిమాలని రూపొందించడంలో పేరుపొందిన ఈ నిర్మాణ సంస్థ ఇటీవలే ఉత్తరాంధ్ర సంప్రదాయాలను అందంగా చూపిస్తూ జానపదం ‘నల జిలకర మొగ్గ’తో అందరి మనసులు గెలుచుకుంది.
ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆనందిని లెజెండరీ ‘గరివిడి లక్ష్మి’ పాత్రలో పరిచయం చేశారు. హాఫ్ శారీ ధరించి, రిక్షాలో కూర్చున్న ఆనంది, ఒడిలో సంగీత వాయిద్యం హార్మోనియంతో చిరునవ్వుతో కనిపించడం ఆకట్టుకుంది.
గరివిడి లక్ష్మి ఒక గొప్ప బుర్రకథ కళాకారిణి. 1990లలో ఉత్తరాంధ్ర ఫోక్ సాంప్రదాయాల్ని బతికించి, ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ఆమెకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆమె పేరే ఇప్పుడు ఆ ప్రాంత చరిత్రలో నిలిచిపోయింది.
'గరివిడి లక్ష్మి' గ్రామీణ జీవనానికి, సంగీత వారసత్వానికి అద్భుతమైన ట్రిబ్యూట్ లా ఉంటుంది. ఇది ఓ ఎమోషనల్ జర్నీ, మన సంస్కృతి మీద ప్రేమతో చేయబడ్డ ఎంటర్టైనర్.
చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ సినిమా, ఉత్తరాంధ్రని ఆవిష్కరిస్తూ మనసుని తాకేలా ఉంటుంది. జె. ఆదిత్య ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.
తారాగణం: ప్రముఖ నటుడు నరేష్, రాసి, ఆనంది, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: T.G. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము
సినిమాటోగ్రాఫర్ (DOP): J. ఆదిత్య
సంగీతం: చరణ్ అర్జున్
చీఫ్ కోఆర్డినేటర్: మేఘా శ్యామ్ పాతాడ
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ చౌదరి కొల్లి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సుకుమార్ కిన్నెర,
Asst. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: దుర్గా ప్రసాద్, క్రాంతి కుమార్ దత్తి
ప్రొడక్షన్ కంట్రోలర్: విశ్వేష్ ఆంపోలు, దాసరి రాజు బాల కృష్ణ
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
మార్కెటింగ్ (PMF): శామ్యూల్ డేవిడ్, శరత్ చంద్ర బొద్దనపల్లి
తాజా వార్తలు
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి







