వకుళమాత ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: టిటిడి చైర్మన్ బీ.ఆర్ నాయుడు
- July 18, 2025
తిరుపతి: పాతకాల్వ పేరూరు బండపై వెలసిన వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టిటిడి చైర్మన్ బీ.ఆర్ నాయుడు తెలిపారు. పేరూరు వకుళామాత ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, క్యూ లైన్లు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై నివేదిక తయారు చేయాలని టిటిడి అధికారులకు సూచించారు.తక్షణం చేపట్టాల్సిన పనుల వివరాలను తమ దృష్టికి తీసుకువస్తే టిటిడి బోర్డులో చర్చించి ఆమోదం తెల్పుతామన్నారు.
అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్ కు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.దర్శన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేపట్టి అమ్మవారి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏ.ఈ.వో గోపినాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







