'కిల్లర్' స్టయిలీష్ & పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
- July 19, 2025
మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైటిల్ "కిల్లర్". ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్‌జె సూర్యా సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని V. C. ప్రవీణ్, బైజు గోపాలన్ కలిసి నిర్మిస్తున్నారు కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఇటివలే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
మేకర్స్ ఈ రోజు కిల్లర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఎస్.జె. సూర్య బ్లాక్ కోటు ధరించి షాట్ గన్ పట్టుకుని స్టయులీష్ గా కనిపించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
మరో పోస్టర్ లో ఒకవైపు చేతిలో గన్ పట్టుకుని, రెడ్ డ్రెస్‌లో ఉన్న ప్రీతి అస్రాని ని భుజాన ఎత్తుకున్న లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమా పై చాలా క్యురియాసిటీ క్రియేట్ చేశాయి.
అకాడమీ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రాజెక్ట్ రావడం చూస్తేనే సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం అవుతుంది.ఇది ఎస్.జె. సూర్యా – ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో ఐదో సినిమా. ఇంతకు ముందు నాని, న్యూస్, అన్బే ఆరుయిరే, పులి సినిమాల్లో కలిసి పనిచేశారు.
'కిల్లర్' సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా అంతటా ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









