ఖురాయత్ - రియాద్ ట్రైన్ నెట్‌వర్క్
- July 15, 2016
సౌది అరేబియా, న్యూ ట్రైన్ నెట్‌వర్క్‌ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. క్యాపిటల్ రియాద్ నుంచి కురాయత్‌ని కలిపేలా సౌదీ అరేబియా రైల్వే కంపెనీ (ఎస్‌ఎఆర్) ఈ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పూర్తి చేసింది. రియాద్‌మరియు దమ్మమ్ మధ్య రైల్వే లింక్ ఏర్పడి 65 ఏళ్ళయిన సందరభంగా ఈ విషయం వెల్లడయ్యింది. ప్రస్తుతానికి 136 కిలోమీటర్ల వేగంతో ప్యాసింజర్ ట్రైన్‌ని ఆపరేషనల్ స్టేజ్‌లో నడుపుతోంది. ముందు ముందు దీని వేగాన్ని 200 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. ఎస్‌ఎఆర్ రెండు రకాలైన ప్యాసింజర్ ట్రైన్లను నిర్వహిస్తోంది. డియుర్నల్ మరియు నోక్ట్నోల్ రైళ్ళను నడుపుతోంది. డియుర్నల్ రైళ్ళు 444 మందికి వీలుగా ఉంటుంది. దీనికి రెండు ఇంజిన్ క్యారేజీలు మరియు 9 సీటింగ్ ఏరియాస్ ఉంటాయి. ఇందులో 4 ఎకానమీ క్లాస్ క్యారేజ్‌లు, మూడు బిజినెస్, ఒక రెస్టారెంట్ క్యారేజీలు ఉంటాయి. ఒకటి లగేజ్ కోసం ఏర్పాటు చేశారు. ఈ రైలు పొడవు 280 మీటర్లు. నోక్టోర్నల్ ట్రైన్లు 377 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది ఒకేసారి. రెండు ఇంజిన్లు, 13 ప్యాసింజర్ కార్లు ఉంటాయి. వాటిల్లో మూడు ఎకానమీ క్లాస్, ఒకటి బిజినెస్, మూడు స్లీపింగ్, నాలుగు కార్ ట్రాన్స్‌పోర్టేషన్, ఒక రెస్టారెంట్ క్యారేజీ మరియు ఒక లగేజ్ సెక్షన్ ఉంటాయి. 380 మీటర్ల పొడవున ఈ రైలు ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







