షేరింగ్ ఫ్రిజ్‌లు రమదాన్ పూర్తయ్యాక కూడా
- July 15, 2016
50కి పైగా రమదాన్ ఫ్రిజ్‌లు యూఏఈలోని కార్మికులకు రమదాన్ సందర్భంగానే కాకుండా రమదాన్ ముగిసిన తర్వాత కూడా చల్లని కబురు అందించనున్నాయి. సగానికి పైగా ఫ్రిజ్‌లు 14 దుబాయ్ కమ్యూనిటీస్‌లో సేవలు అందించనున్నాయి. మిర్దిఫ్, ది మెడోస్, ది లేక్స్, మోటర్ జిటీ, జబెల్ అలీ, మరియు అల్ బర్షాలలో ఈ ఏడాది చివరి వరకు ఫ్రిజ్‌లు కార్మికుల కోసం అందుబాటులో ఉంటాయి. రమదాన్ షేరింగ్ ఫ్రిజ్‌స్ పేరుతో ఫేస్‌బుక్ గ్రూప్ నిర్వహిస్తున్న ఆస్ట్రేలియాకి చెందిన 29 ఏళ్ళ సుమ్మయ్యా సైద్ మాట్లాడుతూ, ఈ షేరింగ్ ఫ్రిజ్‌ల విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వేసవి సందర్భంగా విదేశాలకు వెళ్ళేవారు తమ ఫ్రిజ్‌లను ఈ గ్రూప్ ద్వారా మరింత ఎక్కువమందికి సేవలందించడానికి ఇస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రమదాన్ మాసం అంటే 'జాయ్ ఆఫ్ గివింగ్' కింద భావిస్తారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం చాలా గొప్ప విషయమని జోర్డాన్ నుంచి వచ్చిన దుబాయ్ రెసిడెంట్ ఒమర్ షాంకితి చెప్పారు. ప్రస్తుతానికి 26 ఫ్రిజ్‌లు దుబాయ్‌లో పనిచేస్తున్నాయనీ, ముందు ముందు ఈ సంఖ్య బాగా పెరుగుతుందనీ, తద్వారా ఎక్కువమందికి ఉపయోగపడ్తాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







