వేడి వాతావరణం కారణంగా పని వేళలు మార్చనున్న కతర్ కంపెనీలు
- July 15, 2016వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న కతర్ లో బయట పనిచేసే కార్మికులు తమకు ఉదయం వేళలో లేదా సాయంత్రం వేళలో పని సమయాలను కేటాయించాలని కతర్ లోని పలు నిర్మాణ సంస్థలను కోరారు.పగటి ఉష్ణోగ్రతలు దేశంలో క్రమేపీ పెరుగుతుండటం నలభై డిగ్రీల కంటే ఎక్కువగా వేడి పెరుగుతుండటంతో నిర్మాణల కంపెనీలు కార్మికుల ఉపశమనం కల్గించేందుకు పని వేళలో ఈ మార్పు బలవంతంగా చేశారు. దీనితో కార్మికులకు పని వేళలు ఉదయం లేదా సాయంత్రం వేళలో మార్పులు కారణంగా పని సులభంగా జరగడమే కాక ఉత్పాదకత మెరుగుపడి మరియు నిర్మాణ ప్రాంతాలలో పని గమనం మెరుగుపడింది. మంత్రిత్వ శాఖ విధించిన నిబంధన ప్రకారం మధ్యాహ్నం పూట పనిని కతర్ లో నిషేధించబడింది; ఉష్ణోగ్రతలు భరించలేని కారణంగా దీనితో అన్నికంపెనీలు ఉదయం11:30 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు వచ్చే నెల ఆగస్టు చివరి వరకు ఇది కొనసాగుతుంది.ఉదయం 10 గంటల నుండి సూర్యాస్తమయం వరకు కార్మికులు వేసవి ఉష్ణోగ్రతలు భరించలేక పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరియు వెలుపల పని చేసే కార్మికులు కోసం ఆయా సంస్థలు పని సులభంగా జరిగేందుకు రాత్రి 2:30 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అలాగె మరొక పనివేళ సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే పని మార్పులను ప్రవేశపెట్టాయిసూర్యుడు అస్తమించిన తర్వాత వాతావరణ పరిస్థితులు భరించదగిన రీతిలోనే ఉంటాయి కనుక పలువురు కార్మికులు సాయంత్రం షిఫ్ట్ ని ఇష్టపడతారు. కొత్త షెడ్యూల్ అమలులో లేకపోతే దేశంలో వివిధ పనులకు వడగాలి తీవ్ర విఘాతం కల్గించేదని ప్రస్తుతం పనివేళల మార్పు ఫలితంగా నిర్మాణ సంస్థల పని ఎంతో మెరుగుపడిందని ఒక ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సూపర్వైజర్ తెలిపారు..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







