'ఒసారా' ప్రాజెక్ట్: కోస్టల్ టూరిస్ట్ డెస్టినేషన్..!!
- July 25, 2025
సలాలా: సలాలాలోని రేసుట్ బీచ్‌లో ఉన్న "ఒసారా" పర్యాటక ప్రాజెక్ట్.. ఖరీఫ్ ధోఫర్ (వర్షాకాలం) సీజన్ 2025తో పాటు ప్రముఖ పర్యాటక, వినోద గమ్యస్థానంగా నిలుస్తుంది.. ఈ సంవత్సరం, "ఒసారా" లో కొత్త అభివృద్ధి పనులను చేపట్టారు. సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి వాటర్‌ఫ్రంట్‌తో సహా సముద్ర వీక్షణ ప్రాంతాలను విస్తరించారు. అలాగే, సీటింగ్ ఏర్పాట్లు, డైరెక్ట్ బీచ్ వీక్షణలను అందించే రెస్టారెంట్లు, కేఫ్‌లు వంటివి ఉన్నాయని ప్రాజెక్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన మాజిద్ సంహాన్ అల్ మషాలి తెలిపారు.
అడ్వెంచర్ జోన్లో ఈ సంవత్సరం ఎలక్ట్రిక్ గేమ్‌ల కోసం కొత్త ప్రాంతాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది పిల్లలు, వారి కుటుంబాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుందన్నారు. వాటర్‌ఫ్రంట్ గేమ్లతోపాటు ఒమానీ హస్తకళలు, ధోఫర్ గవర్నరేట్ ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ ఉత్పత్తులను ప్రదర్శించే సాంప్రదాయ మార్కెట్ కూడా ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







