ఒమన్ లో రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు వంటగది ధ్వంసం

- July 16, 2016 , by Maagulf
ఒమన్ లో రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు వంటగది ధ్వంసం

             

 

మస్క్యాట్:  అల్ ఖువైర్ లో ఒక రెస్టారెంట్ వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఆ ప్రాంతం ధ్వంసం కాబడినట్లు పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ ( PACDA ) శుక్రవారం నివేదించింది.

పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో రెస్టారెంట్ వెలుపల నిలిపి ఉన్న కార్లు సైతం ధ్వంసం అయ్యాయి. ఈ విస్ఫోటనంలో అల్ ఖువైర్ ఇరానియన్ హౌస్ రెస్టారెంట్ భవనం కొన్నిచోట్ల కుప్పకూలిందని పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ ఒక ట్వీట్ లో తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com