9/11 దాడులతో సౌదీకి ఎటువంటి సంబంధం లేదు
- July 16, 2016
సెప్టెంబర్ లెవన్ దాడుల్లో సౌదీ అరేబియా పాత్రలేదని తాజాగా విడుదలైన నివేదిక స్పష్టం చేసింది. 2001లో అమెరికాపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 3000 మంది మరణించారు. ఆ దాడుల్లో సౌదీ అరేబియా ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు ఇన్నాళ్లూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై విమానాలతో దాడి చేసిన హైజాకర్లలో సుమారు 15 మంది సౌదీ దేశస్థులే కావడం వల్ల ఆ దేశాన్ని ఇన్నాళ్లూ అనుమానించారు. అయితే శుక్రవారం అమెరికా కాంగ్రెస్ ఆ దాడులపై రూపొందించిన రహస్య నివేదికను విడుదల చేసింది. గతంలోనే ఆ రిపోర్ట్‌ను రిలీజ్ చేసినా అందులో ఉన్న 28 పేజీల నివేదికను మాత్రం బయటపెట్టలేదు. అయితే సౌదీ నుంచి అధికారికంగా హైజాకర్లకు ఎటువంటి సహాయం అందలేదని తాజా నివేదిక స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ ప్యానల్ సెప్టెంబర్ 11 దాడులపై 2002లోనే తొలి నివేదికను వెల్లడించింది. అయితే అందులో ఉన్న 28 పేజీలకు సంబంధించిన నివేదికను గత 13 ఏళ్లుగా రహస్యంగా ఉంచారు. ఆ పేజీల్లో ఉన్న అంశాలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ పేజీల్లో ఉన్న సమాచారాన్ని బయటపెట్టాలని గత కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు, సెప్టెంబర్ 11 దాడుల బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మిత్ర దేశమైన సౌదీని అమెరికా ప్రభుత్వం రక్షిస్తోందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మొత్తం 19 మంది హైజాకర్లు 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై విమానాలతో దాడి చేశారు. అందులో 15 మంది హైజాకర్లు సౌదీ జాతీయులని స్పష్టమైంది. తాజాగా రిలీజైన డాక్యుమెంట్ల నివేదికను సౌదీ ప్రభుత్వం స్వాగతించింది. అమెరికాపై జరిగిన ఉగ్ర దాడిలో సౌదీల పాత్ర లేదని రిపోర్ట్ పేర్కొన్నట్లు ఆ దేశ దౌత్యవేత్త తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







