విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్..
- July 29, 2025
అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం భారీ చర్యలకు శ్రీకారం చుట్టింది.ఈ లక్ష్యంతో విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ‘పార్ట్నర్షిప్ సమ్మిట్’ నిర్వహించనుంది.దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సమ్మిట్‌కు ఆరుగురు మంత్రులతో కూడిన హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మంత్రివర్గంలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ సభ్యులుగా ఉండనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వేదిక ఏర్పాట్లు, వసతులు, పర్యాటక మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు మరో 9 వర్కింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







