ఈ-గేమింగ్ ప్రమాదాలపై ఒమన్ హెల్త్ మినిస్ట్రీ హెచ్చరిక..!!
- July 30, 2025
మస్కట్: నేటి టెక్నాలజీ యుగంలో ఎలక్ట్రానిక్ గేమ్‌లు పిల్లల జీవితాల్లో లోతుగా పాతుకుపోయాయి. ఈ డిజిటల్ గేమ్స్ పెరుగుదలపై ఆరోగ్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని పరిష్కరించడానికి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తల్లిదండ్రులకు పలు సూచనలు చేసింది. సమతుల్య, ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని సూచించింది. అధిక సమయం గేమ్స్ ఆడటం కారణంగా హానికరమైన ప్రభావాల గురించి వివరిస్తూ ఒక అవగాహన బులెటిన్‌ను విడుదల చేసింది.
గేమింగ్ వ్యసనం కారణంగా పిల్లలు వర్చువల్ ప్రపంచాలలో మునిగిపోతారని, తరచుగా సామాజిక, వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను దెబ్బతీస్తుందన్నారు. ముఖ్యంగా హింసాత్మక గేమ్స్ కారణంగా దూకుడు ప్రవర్తన, నిద్ర సమస్యలు, మానసిక ఆరోగ్యం దెబ్బతీసే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక శారీరక పరిణామాలలో కళ్లపై ఒత్తిడి, బరువు పెరగడం, కండరాలపై అధిక ఒత్తి వంటి సమస్యలు కనిపిస్తాయని జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ మోనా మొహమ్మద్ అన్నారు.
వయస్సుకు తగిన స్క్రీన్ సమయం సిఫార్సు:
2–5 సంవత్సరాల వయస్సు: కంటెంట్ విద్యాపరంగా ఉండేలా చూసుకోవడం ద్వారా రోజుకు ఒక గంటకు పరిమితం చేయండి.
6 సంవత్సరాల వయస్సు, అంతకంటే ఎక్కువ వయస్సు: కంటెంట్ నాణ్యతపై పర్యవేక్షణతో రోజుకు రెండు గంటలకు మించకూడదు.
స్క్రీన్ ఎక్స్పోజర్ను బ్యాలన్స్ చేసేందుకు మంత్రిత్వ శాఖ సైక్లింగ్, బాస్కెట్‌బాల్, చేతిపనులు, బుక్ రీడింగ్, పబ్లిక్ సెర్చ్ వంటి కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. ఇది మానసిక, శారీరక సమస్యలను అధిగమించేందుకు సహాయపడుతుందన్నారు.
ఎలక్ట్రానిక్ గేమ్‌లు పిల్లల రివార్డ్ సెంటర్లను అలర్ట్ చేయడానికి రూపొందించబడ్డాయని, మెదడులో డోపమైన్ స్థాయిలను నింపుతాయన్నారు. కాలక్రమేణా, ఇది నిద్ర, అటెన్షన్, లెర్నింగ్ పనితీరును ప్రభావితం చేస్తుందన్నారు.
తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్క్రీన్ టైమ్ పై పరిమితులను నిర్ణయించాలని, ఇతరులతో ఆడేలా చూడాలని, బ్యాలన్స్ టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని, కుటుంబంతో కలిసుండే సమయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఇవన్నీ డిజిటల్ వెల్నెస్ను నిర్వహించడంలో కీలకమైన దశలుగా పనిచేస్తుందన్నారు జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ మోనా మొహమ్మద్.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







