టర్కీలో తిరుగుబాటు నేపథ్యంలో 2700మంది జడ్జీల తొలగింపు

- July 16, 2016 , by Maagulf
టర్కీలో తిరుగుబాటు నేపథ్యంలో 2700మంది జడ్జీల తొలగింపు

టర్కీలో సైన్యం తిరుగుబాటు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2,700మందికి పైగా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. దేశ జ్యుడిషయల్‌ బోర్డు అయిన జడ్జీలు, ప్రాసిక్యూటర్ల హైకౌన్సిల్‌ నిర్ణయం మేరకు న్యాయమూర్తులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కౌన్సిల్‌లోని ఐదుగురు సభ్యులను కూడా తీసేసినట్లు సమాచారం. అయితే వీరిని ఎందుకు తొలగించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
టర్కీలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటుకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు, సైన్యం మధ్య జరిగిన కాల్పుల్లో 160 మంది మృతిచెందగా.. వేలమంది గాయపడ్డారు. తిరుగుబాటు నేపథ్యంలో 3వేల మందికి పైగా సైనికులను అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com