టర్కీలో తిరుగుబాటు నేపథ్యంలో 2700మంది జడ్జీల తొలగింపు
- July 16, 2016
టర్కీలో సైన్యం తిరుగుబాటు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2,700మందికి పైగా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. దేశ జ్యుడిషయల్ బోర్డు అయిన జడ్జీలు, ప్రాసిక్యూటర్ల హైకౌన్సిల్ నిర్ణయం మేరకు న్యాయమూర్తులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కౌన్సిల్‌లోని ఐదుగురు సభ్యులను కూడా తీసేసినట్లు సమాచారం. అయితే వీరిని ఎందుకు తొలగించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
టర్కీలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటుకు పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు, సైన్యం మధ్య జరిగిన కాల్పుల్లో 160 మంది మృతిచెందగా.. వేలమంది గాయపడ్డారు. తిరుగుబాటు నేపథ్యంలో 3వేల మందికి పైగా సైనికులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







