బాహుబలి2 కి వెరైటీగా ప్రొమోషన్
- July 16, 2016
సినిమా తీయడం ఒక ఎత్తైతే...దాన్ని జనానికి చేర్చడం నిజంగా ఒక పెద్ద టాస్క్. ఎంత పెద్ద మూవీకైనా ప్రమోషన్ ముఖ్యం. పబ్లిసిటీ ముఖ్యం. అది కూడా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉండాలి. వాళ్లను థియేటర్స్ కు రప్పించగలగాలి. అప్పుడే అసలైన సక్సెస్. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే...వెరైటీగా ప్రమోట్ చేయాలి. ఎట్ ప్రెజెంట్ ...బాహుబలి -2 ప్రమోషన్ కోసం డైరెక్టర్ రాజమౌళి కొత్త ఐడియాలు వేస్తున్నాడట.ఏదైనా సినిమా తీసిన తర్వాత దాన్ని వెరైటీగా ఎలా ప్రమోట్ చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తు న్నారు నిర్మాతలు, దర్శకులు. బాహుబలి శిల్పి రాజమౌళి కూడా ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రమోషన్ కోసం రాజమౌళి ఓ న్యూ టెక్నిక్ లో వెళ్లాడు. మామూలుగా సినిమా పబ్లిసిటీకి ఉపయోగించే ఫ్లెక్సీలు లేదా హోర్డింగ్ ల రూట్ ను దాదాపు వదిలిపెట్టాడు. బాహుబలి బిగినింగ్ పార్ట్ ప్రమోషన్ కోసం రాజమౌళి సోషల్ మీడియానే మ్యాగ్జిమమ్ ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు బాహుబలి చివరి భాగాన్ని కూడా వెరైటీగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. ఆటబొమ్మలు, వీడియో గేమ్స్ , ఇంకా ఇతర సాధనాలను మూవీ ప్రమోషన్ కోసం సాధనంగా వాడాలనుకుంటున్నాడు. మూవీలో ఉపయోగించే వస్తువులతోనే పబ్లిసిటీ ఇవ్వాలనుకుంటున్నాడు.సామాన్యంగా హాలీవుడ్ మూవీస్ కు ఈ టైప్ ప్రమోషన్ పద్ధతుల్ని ఎంచుకుంటారు. బాహుబలి 2 కి కూడా ఇలా వెరైటీగా ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







