కెసర్ పిస్తా మిల్క్ షేక్
- July 16, 2016
మండే ఎండల్లో చల్లచల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. ఇక ఆహార ప్రియులకు అయితే తాగడం వరకు ఓ.కే.. అదే కాస్త వెరైటీ రుచి వుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అటువంటి వారి కోసమే ఈ కొత్త రకం. ఒకసారి తింటే చాలు మళీమళ్లీ తిపాలనిపించే రుచి దాని సొంతం. సమ్మర్ లో ఐస్ క్రీమ్స్, స్మూతీస్, కుల్ఫీ మరియు మిల్క్ షేక్ లను టేస్ట్ చేయడానికి ఇదే మంచి సమయం. మిల్క్ షేలను వివి ధ వెరైటీ ఫ్లేవర్స్ తో బాదాం, కేసర్, చిక్కో, మ్యాంగో, లిచి మరియు పిస్తా ఫ్లేవర్ లతో తయారు చేసుకుంటారు. ఈ మిల్క్ షేక్ కు కొద్దిగా కేసర్(కుంకుమపువ్వు)జోడించి కలిపి తయారు చేసుకోవచ్చు. కెసర్ పిస్తా మిల్క్ షేక్ మన ఇండియన్ స్టైల్లో తయారు చేస్తే ఎలా ఉంటుందో ఒక సారి టేస్ట్ చేయండి . ఈసమ్మర్ సీజల్ ఫ్రెండ్స్, ఫామిలీ మెంబర్స్ కు ఒక అద్భుతమైన ట్రీట్ కేసర్ పిస్తా మిల్క్ షేక్..
కావల్సిన పదార్థాలు :
పిస్తాచో(పిస్తాపప్పు)-1cup , కేసర్(కుంకుమపువ్వు)- కొద్దిగా , బాదం:1/2cup , పంచదార: 11/2cup , యాలకలు: 4-5 , పాలు: 1ltr
తయారుచేయు విధానం :
ముందుగా బాదం మరియు పిస్తాలను రెండు డిఫరెంట్ బౌల్స్ లో విడివిడిగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత , గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను బాగా మరిగించి , మంట తగ్గించి మరికొంత సేపే బాగా పాలు కాచాలి. ఇప్పుడు ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకొన్న బాదం, పిస్తా మరియు యాలకలు వేసి మొత్తం మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి . మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను కాగుతున్న పాలలో వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు అదే పాలలో పంచదార వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత చివరగా కొద్దిగా కుంకుపువ్వు చిలకరించాలి. పాలను తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి. పాలు కొద్దిగా చిక్కపబడుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి, ఈ మిల్క్ షేక్ గది ఉష్ణోగ్రతలో చల్లారనివ్వాలి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







