రష్యా జట్టును ఒలింపిక్స్ నుంచి నిషేధించాలని డిమాండ్ ..
- July 17, 2016
సోచీ వింటర్ ఒలింపిక్స్‌లో వచ్చిన ఆరోపణలపై వచ్చే వారం విడుదలయ్యే కీలక నివేదికలో రష్యా దోషిగా తేలితే ఆ జట్టును రియోకు అనుమతించకూడదనే డిమాండ్‌ను పలు యాంటీ డోపింగ్ ఏజన్సీలు చేస్తున్నాయి. వీటిలో అమెరికా, కెనడా వంటి అగ్రరాజ్యాలకు చెందిన ఏజన్సీలు కూడా ఉండటం విశేషం. అవి తమ అభిప్రాయాన్ని శనివారం తెలిపాయి. శనివారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సిద్ధం చేసిన ఓ పత్రం బయటకు పొక్కడంతో ఈ విషయం వెల్లడైంది. దీంతోపాటు అమెరికాకు చెందిన యాంటీ డోపింగ్ ఏజన్సీ యూఎస్‌ఏడీఏ సీఈవో ట్రావీస్ ట్రైగ్రెట్ కూడా రష్యా జట్టును ఒలింపిక్స్ నుంచి పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనికి కెనడా కూడా మద్దతు తెలిపింది.
కెనడియన్ సెంటర్ ఫర్ ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ (సీసీఈఎస్) సీఈఓ పాల్ మెలియా మాట్లాడుతూ ఐవోసీ ఒలింపిక్స్ నియమనిబంధనలను అమలు చేయడంలో ఆదర్శంగా ఉంటుందని నమ్ముతున్నామన్నారు. నిబంధనలను పరిశీలించి 2016 రియో ఒలింపిక్ క్రీడలలో పాల్గొనకుండా రష్యాను నిషేధించాలని కోరారు. ఇప్పటికే రష్యాకు చెందిన ట్రాక్ అండ్‌ఫీల్డ్ అథ్లెటిక్స్ విభాగం ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా ఐఏఏఎఫ్ నిషేధించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







