ఢిల్లీలో గోడకూలి 8 మంది మృతి
- August 09, 2025
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పండగ సంతోషాలను చెరిపేసేలా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రావణ మాసపు పండుగ ఉత్సాహం నడుమ, ఢిల్లీలోని హరినగర్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం స్థానికులను విషాదంలో ముంచేసింది. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో, హరినగర్‌లోని పాత ఆలయానికి ఆనుకుని ఉన్న ఒక భారీ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ గోడ కూలిన దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.
అయితే హాస్పిటల్లో చికిత్స పొందరు వారు మరణించినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇక్కడ ఒక పాత ఆలయం ఉంది, దాని పక్కనే స్క్రాప్ డీలర్లు నివసించే పాత జగ్గీలు ఉన్నాయి.రాత్రిపూట కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలిపోయి ఈ ప్రమాదం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. స్థానికంగా ఉన్న జగ్గీలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఐశ్వర్య శర్మ తెలిపారు.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్