ఒమన్ ప్రధాన రహదారులపై స్మార్ట్ కెమెరాల నిఘా..!!
- August 10, 2025
మస్కట్: ఒమన్ ప్రధాన రహదారులు స్మార్ట్ కెమెరాల పరిధిలో చేరాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వంటి కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మరియు ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణకు రాయల్ ఒమన్ పోలీసులు ఇటీవల స్మార్ట్ ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రమాదాలను తగ్గించడంతోపాటు స్మార్ట్ వాహనాల ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ పై పర్యవేక్షణ పెరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ అలీ బిన్ సలీమ్ అల్ ఫలాహి తెలిపారు.
ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ తో ట్రాఫిక్ సిగ్నల్లను అనుసంధానించేందుకు వీలుగా అప్గ్రేడ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనల గురించి స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ సమన్వయంతో డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రోగ్రామ్లో స్కూల్ బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..