అబుదాబిలో విషాదం.. తెలంగాణకు చెందిన ప్రవాస దంపతులు మృతి..!!

- August 10, 2025 , by Maagulf
అబుదాబిలో విషాదం.. తెలంగాణకు చెందిన ప్రవాస దంపతులు మృతి..!!

యూఏఈ: యూఏఈ రాజధాని అబుధాబిలో విషాదకర సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దుర్ఘటనలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించగా, వారి ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. గురువారం తెల్లవారుజామున అల్ ధన్నా నగరంలో కారు ప్రమాదం జరిగిందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఈ జంట అబుదాబి నుండి కారులో వెళుతుండగా యాక్సిడెంట్ జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల నుండి పదకొండు సంవత్సరాల మధ్య వయస్సు గల వారి ముగ్గురు పిల్లలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఒకరి పరిస్థితి ఇంకా విషమంగా ఉందన్నారు.

ఇక మృతులను సయ్యద్ వహీద్, సనా బీఘుమ్ గా గుర్తించినట్లు తెలిపారు. సయ్యద్ వహీద్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని, అతను 2018 నుండి యూఏఈలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి వారి మృతదేహాలను భారత్ కు పంపినట్లు తెలిపారు. వారి అంత్యక్రియలు భారత్ లో ముగిసినట్లు సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com