'కబాలి' ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి...
- July 17, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కబాలి' చిత్రం విడుదలకు ముందే రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. ఎయిర్ ఏషియా స్పెషల్ ప్యాకేజ్, కబాలి యాప్, కబాలి ఇమోజీ, వెండి నాణెలు ఇలా పలు విధాలుగా రజనీకాంత్ తన సూపర్‌స్టార్ ఇమేజ్‌ను చాటుకున్నారు. జులై 22 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని అమెరికాలో 400 స్క్రీన్లపై విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ముందస్తు బుకింగ్‌లో ఈ చిత్రం టికెట్లు కేవలం రెండు గంటల్లోనే అయిపోయినట్లు సమాచారం. ఇది ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నా.. నమ్మక తప్పని సత్యం అంటున్నారు సినీ వర్గాలు. అంతే మరి.. రజనీకాంత్ చిత్రానికి భారతదేశంలోనే కాదు అమెరికాలోనూ చాలా డిమాండ్ ఉందని ఈ విషయంతో స్పష్టమవుతోంది. మరి విడుదల తర్వాత 'కబాలి' ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన రాధికా ఆప్టే నటించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







