జులై 29న విడుదల కానున్న తెలుగు 'ది బీఎఫ్‌జీ'
- July 17, 2016
జురాసిక్ పార్క్, జాస్, ఇండియానా జోన్స్ తదితర చిత్రాలతో అద్భుతాలు సృష్టించిన దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్. ఇప్పుడు మరో అద్భుతంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ది బీఎఫ్‌జీ' (బిగ్ ఫ్రెండ్లీ జెయింట్). జులై 29న దేశవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లు సంయుక్తంగా దీనిని నిర్మించాయి.
సినిమాలో ప్రధాన పాత్రకు తెలుగులో నటుడు జగపతిబాబు వాయిస్ ఇచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. 'స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన చిత్రంలో భాగస్వామ్యం కావడం నాకు దక్కిన గౌరవం. హిందీలో అమితాబ్ డబ్బింగ్ చెప్పిన ప్రధాన పాత్రకు తెలుగులో నేను డబ్బింగ్ చెప్పాను. ఈ అవకాశం నాకు కల్పించిన రిలయన్స్ బృందానికి ధన్యవాదలు' అని అన్నారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







