పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- October 11, 2026
దోహా: పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు, నైపుణ్యాలు, అనుభవాలను పంచుకునే దిశగా ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధి బృందం యూఏఈలో పర్యటించింది. ఈ బృందానికి ఖతార్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్లోని యూనిఫైడ్ సర్వీసెస్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ మహమ్మద్ అలీ అల్ మొహన్నది నేతృత్వం వహించారు.
ఈ పర్యటనలో భాగంగా అబుదాబిలోని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీతో పాటు దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్‌ను ప్రతినిధి బృందం సందర్శించింది. పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు.
డిజిటల్ పరివర్తన, విధానాల సరళీకరణ, కార్యాచరణ ప్రక్రియల మెరుగుదల వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య అనుభవాలను పంచుకోవడంపై ప్రతినిధి బృందం దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ విధమైన పరస్పర పర్యటనలు ప్రభుత్వ సేవల్లో సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రజలకు మరింత నాణ్యమైన, సులభతరమైన సేవలు అందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
తాజా వార్తలు
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!
- మస్కట్‌లో అంతర్జాతీయ కార్డియాక్ సర్జరీపై వర్క్‌షాప్..!!
- కువైట్‌లో KD 15,000 విలువైన గొర్రెలు చోరీ..!!
- బహ్రెయిన్ పార్లమెంట్లో ఆహార భద్రతపై చర్చ..!!
- ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!
- దుబాయ్‌లో తగ్గుతున్న రెంట్స్..ఇళ్లు మారుతున్న టెనేంట్స్..!!
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు







