రియాద్‌ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్‌వేస్..!!

- October 11, 2026 , by Maagulf
రియాద్‌ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్‌వేస్..!!

కువైట్: ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయం మూసివేయడంతో కువైట్ ఎయిర్‌వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్‌ నుంచి సౌదీ అరేబియాలోని రియాద్‌కు, అక్కడి నుంచి కువైట్‌కు నడవాల్సిన విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది.  తమ విమానాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కువైట్ ఎయిర్‌వేస్ ప్రయాణికులకు సూచించింది. బుకింగ్ సమయంలో నమోదు చేసిన మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ సందేశాలు, ఇతర నోటిఫికేషన్ల ద్వారా మార్పుల వివరాలను తెలియజేస్తామని పేర్కొంది. విమానాల తాజా సమాచారం కోసం సంస్థ అధికారిక సమాచార మార్గాలను అనుసరించాలని ప్రయాణికులకు సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com