కొన్ని అంకర్ పవర్ బ్యాంక్‌లపై ఖతార్ ఎయిర్వేస్ నిషేధం..!!
- August 14, 2025
దోహా: కొన్ని అంకర్ పవర్ బ్యాంక్‌లపై ఖతార్ ఎయిర్వేస్ నిషేధం విధించింది. ప్రయాణీకులు నిర్దిష్ట అంకర్ పవర్ బ్యాంక్ మోడళ్లను తీసుకెళ్లడం లేదా చెక్ ఇన్ చేయడం ఇక కదరదని తెలిపింది. లిథియం-అయాన్ బ్యాటరీలకు సంబంధించిన ప్రమాద సంఘటనల కారణంగా ఇటీవల రీకాల్ చేసిన తర్వాత తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖతార్ ఎయిర్ వేస్ తెలిసింది.
ప్రయాణానికి ముందు ప్రయాణికులందరూ తమ వద్ద ఉన్న అంకర్ పవర్ బ్యాంక్‌లను ధృవీకరించాలని తన ప్రకటనలో ఖతార్ ఎయిర్ వేస్ కోరింది.
అంతర్గత షార్ట్ సర్క్యూట్ల ప్రమాదం కారణంగా ఇది వేడెక్కడానికి మరియు అగ్నిప్రమాదాలకు దారితీయవచ్చన్న నివేదికల ఆధారంగా ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ గత నెలలో వీటిని రీకాల్ చేసింది.
రికాల్ చేసిన అంకర్ పవర్ బ్యాంక్‌లు మోడళ్లలో A1647 / A1652 / A1681 / A1689 / A1257 తోపాటు అంకర్ పవర్కోర్ 10000.. మోడళ్లు A1642 / A1647 / A1652 ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..