కువైట్ లో పెరుగుతున్న ఆల్కహాల్ పాయిజన్ మృతుల సంఖ్య..!!
- August 14, 2025
కువైట్: కువైట్ లో ఆల్కహాల్ పాయిజన్ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆల్కహాల్ విషప్రయోగం కారణంగా 63 కేసులు నమోదైనట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 40 మంది భారతీయులు ఉన్నారని తెలిపింది.
ఇప్పటివరకు 13మంది మరణించగా.. వీరిలో 10 మంది భారతీయులు మరియు 2 నేపాలీలు ఉన్నారు. ఇంకా అనేక మంది బాధితులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 31 మందికి వెంటిలేటర్ సహాయం అవసరం కాగా, 51 మందికి అత్యవసరంగా కిడ్నీ డయాలసిస్ సెషన్లు జరిగాయని పేర్కొంది. 21 మంది శాశ్వత అంధత్వం లేదా దృష్టి లోపంతో బాధపడుతున్నారని తెలిపింది.
కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం +965-65501587 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఏవైనా అనుమానిత కేసులను అత్యవసర హాట్‌లైన్‌ల ద్వారా వెంటనే నివేదించాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







