అవయవ దానంలో కువైట్ రికార్డులు..!!
- August 16, 2025
కువైట్: అవయవ దానంలో కువైట్ కొత్త రికార్డులను నమోదు చేసింది. 2024లో రికార్డు స్థాయిలో 149 కిడ్నీ మార్పిడిలను నిర్వహించినట్లు కువైట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సొసైటీ చైర్మన్ డాక్టర్ తుర్కి అల్-ఒటైబి తెలిపారు. అవయవ దానం అనేది రోగులకు కొత్త జీవితాన్ని అందించే మానవతా చర్య అని ఆయన తెలిపారు.
ఊపిరితిత్తుల మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, గుండె మరియు మూత్రపిండాల మార్పిడి సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం, కువైట్‌లో 15,000 మంది వ్యక్తులు అవయవ దాత కార్డులను కలిగి ఉన్నారని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 మంది రోగులలో ఒకరు మాత్రమే అవసరమైన అవయవాన్ని అందుకుంటున్నారని, డిమాండ్ సరఫరాను మించిపోయిందన్నారు. ఎక్కువ మంది అవయవ దాతలుగా నమోదు చేసుకోవాలని డాక్టర్ అల్-ఒటైబి కోరారు. ఇది ఇతరుల ప్రాణాలను కాపాడే గొప్ప మానవీయ బహుమతి అని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







