అజ్మాన్ లో ఇ-స్కూటర్ పై నిషేధంపై భిన్నాభిప్రాయాలు..!!
- August 16, 2025
యూఏఈ: అజ్మాన్లో ఇ-స్కూటర్ల వాడకాన్ని నిషేధించాలనే నిర్ణయం కొంతమంది ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మరికొంతమంది నివాసితులు ఈ చర్యను సమాజ భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకునే అధికారులు నిషేధ నిర్ణయి తీసుకుని ఉంటారని MA ట్రాఫిక్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఇంజినీర్ ముస్తఫా అల్దా అన్నారు.
కాగా, చాలా మంది ఈ బైకర్స్ ట్రాఫిక్ చట్టాలను పాటిస్తున్నప్పటికీ, నిర్లక్ష్యంగా ఉండే కొందరి చర్యల వలన తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వారి వల్లే అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుందని అన్నారు.
తాజాగా అజ్మాన్ పోలీసులు అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకాన్ని నిషేధించినట్లు ప్రకటించారు. గత నెలలో ఇ-స్కూటర్లు, ద్విచక్ర వాహనాలను నడిపేవారు రోడ్డుపై నియమాలను పాటించాలని ఒక సలహా జారీ చేశారు. అనధికార ఎలక్ట్రిక్ సైకిళ్ళు, స్కూటర్లను ఉపయోగించవద్దని పోలీసులు హెచ్చరించారు.
2024 సంవత్సరంలో ఇ-స్కూటర్ల కారణంగా 254 ప్రమాదాలు నమోదయ్యాయి. ఆయా ప్రమాదాల్లో 10 మంది మరణించగా, 259 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..