షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..మాజీ ఉద్యోగే సూత్రధారి..!!
- August 17, 2025
యూఏఈః ఇండియాలోని కేరళకు వెకేషన్ కోసం వెళ్లిన షార్జాకు చెందిన బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తన కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగే దీనికి సూత్రధారి అని కేరళ పోలీసులు వెల్లడించారు. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఈ దురాగతానికి ఒడిగట్టాడని తెలిపారు. ఈ క్రమంలోనే షార్జా ఆధారిత ఫార్మసీ చైన్ ను నిర్వహించే వ్యాపారవేత్త కేరళలోని తన స్వస్థలమైన మాలాపురం మలేపురంకు సెలవుల కోసం వచ్చినప్పుడు కిడ్నాప్ కు ప్లాన్ చేసాడని తెలిపారు. కాగా, రెండు రోజుల తరువాత పోలీసులు అతడిని కొల్లం నుండి కిడ్నాప్ ముఠా నుంచి సురక్షితంగా రక్షించారు. కాగా, ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కేరళ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!