అల్ క్కుసైస్ ఫ్లాట్ లో భారత మహిళ ఆత్మహత్య

- July 17, 2016 , by Maagulf
అల్ క్కుసైస్ ఫ్లాట్ లో  భారత మహిళ ఆత్మహత్య

దుబాయ్ లో  ఒక భారతీయ మహిళ ఆదివారం ఆమె నివసిస్తున్న ఆపార్ట్మెంట్ లో  ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కనుగొనబడింది. దుబాయ్ పోలీస్ కార్యకలాపాల గదికి లో అల్ క్కుసైస్  ఒక నివాస భవనం లో ఒక  మహిళ  ఉరి వేసుకొని  చనిపోయినట్లు ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీనితో   పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. అల్ మష్రాఫ్  భవనం ఫ్లాట్ నెంబర్ 302 లో  నివసిస్తున్నఓ  స్త్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు ఆమె మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగంకు తరలించారు.  
ఆత్మహత్యకు పాల్పడిన  స్త్రీ  తన భర్తతో  గత మూడు సంవత్సరాలుగా ముగ్గురు పిల్లలతో ఇదే అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు, వారు సాధారణంగానే కనిపించేవారని ఇరుగుపొరుగు వారు తెలిపారు.  పోలీసులు ఇప్పటికీ ఆమె మరణానికి కారణాలని  పరిశోధిస్తున్నట్లు, ఆ  స్త్రీ  ఆత్మహత్య వెనుక ఎలాంటి నేర ఉద్దేశ్యం ఉన్నట్లుగా తాము భావించడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. 
భర్త ద్వారా సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వబడింది. ఆ భర్త తెలిపిన వివరాల ప్రకారం, తాము కుటుంబ సమేతంగా వేసవి ప్రయాణం చేయాలని  అనుకుంటున్నామని, తనకు  కొన్నిపనులు మిగిలి ఉండటంతో ఆ పనులు పూర్తి చేసేందుకు తాను ఆ రోజు బయటకు వెళ్లినట్లు తెలిపాడు.తాను పనులను ముగించుకొని ఇంటికి  తిరిగి వచ్చినప్పుడు, తన  భార్య బాత్రూంలో ఉండగా తన ముగ్గురు పిల్లలు టీవీ చూస్తున్నారని, తన భార్య ఎంతసేపటికీ బాత్రూం నుంచి రాకపోవడంతో అనుమానం కల్గి బాత్రూం తలుపు మీద అనేక సార్లు తట్టి స్పందన లేకపోవడంతో ఆ తలుపును విరగకొట్టినట్లు తెలిపాడు.  పడగొట్టాడు,లోపలకు తొంగి చూసిన ఆ భర్తకు  పైకప్పు నుంచి కిందకు తాడుతో విగతజీవిగా వేలాడుతున్న తన భార్య కనబడిందని పోలీసులకు వివరించాడు. తన భార్యతో తనకు ఎటువంటి తగాదాలు లేవని తెలిపారు. అయితే, ఆమె వేసవి సెలవులలో ప్రయాణం చేయడం ఇష్టపడలేదు. కానీ ఆమె అందుకు తగినట్లుగా నిస్పృహతో కూడిన  ఏ సూచనలు చేయలేదని ఆ భర్త వాపోయాడు. అక్కడకు వచ్చిన పిల్లలు తరువాత తమ తల్లి మరణం గురించి తెలుసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com