ఇండియన్ రైల్వే సూపర్ టికెట్ బుకింగ్..
- August 17, 2025
న్యూ ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక పై ట్రైన్ టికెట్ల కోసం ఆందోళన అక్కర్లేదు.. జెట్ స్పీడ్‌లో టికెట్ పొందవచ్చు. కొత్త బుకింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. తద్వారా టికెట్ పొందే సమయం మరింత తగ్గనుంది. అంతేకాదు..మీకు కన్ఫార్మ్ అయిన సీటు పొందడంలో కూడా ఎలాంటి ఆలస్యం ఉండదు.
భారతీయ రైల్వేలు త్వరలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను అప్‌డేట్ చేయబోతున్నాయి.ఈ కొత్త PRS సిస్టమ్ అమల్లోకి వస్తే.. టికెట్ బుకింగ్ స్పీడ్ 4 రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం, నిమిషానికి తక్కువ టిక్కెట్లు బుక్ అవుతున్నాయి.
అదే కొత్త సిస్టమ్ వస్తే నిమిషానికి ఎక్కువ మొత్తంలో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ కొత్త సిస్టమ్ ఎప్పుడు వస్తుంది? ఎలా పనిచేస్తుంది? ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అందుకే ఈ టెక్నాలజీ అప్‌గ్రేడ్ కోసం, రైల్వేలు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)తో కలిసి పనిచేస్తున్నాయని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కుల్దీప్ తిరి చెప్పారు. అప్‌గ్రేడ్ ద్వారా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్, సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు పూర్తిగా మార్చేస్తున్నారు.
కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే?
ఈ కొత్త సిస్టమ్ క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. స్పీడ్ మాత్రమే కాదు..చాలా సురక్షితం, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ప్రస్తుత PRS సిస్టమ్ 2010లో ప్రారంభమైంది.పాత ఇటానియం సర్వర్, ఓపెన్ VMS ఆధారంగా రూపొందించారు.పెరుగుతున్న జనాభా, డిజిటల్ ట్రాఫిక్ దృష్ట్యా అప్‌గ్రేడ్ తప్పనిసరిగా మారింది.
మొబైల్ యాప్ రైల్ వన్:
నవంబర్ 1, 2024 నుంచి భారత రైల్వేలు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP)ని 120 నుంచి 60 రోజులకు తగ్గించాయి. తద్వారా టికెట్ క్యాన్సిలేషన్ ఇష్యూ ఉండదు. రైల్వేలు ‘రైల్ వన్’ అనే కొత్త మొబైల్ యాప్ కూడా ప్రవేశపెట్టాయి.
ఈ యాప్ ద్వారా ప్రయాణీకులు తమ మొబైల్ నుంచి రిజర్వ్ చేసిన టికెట్, అన్ రిజర్వ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ ప్రయాణీకుల కోసం రైల్వేలు 2024-25 సంవత్సరంలో దూర ప్రాంతాలకు అనేక రైళ్లకు జనరల్ కోచ్‌లను కూడా చేర్చాయి.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్