రెస్టారెంట్‌లోకి దూసుకెళ్ళిన ట్రక్‌: ఇద్దరు మృతి

- July 17, 2016 , by Maagulf
రెస్టారెంట్‌లోకి దూసుకెళ్ళిన ట్రక్‌: ఇద్దరు మృతి

మెక్‌ డోనాల్డ్స్‌ రెస్టారెంట్‌లోకి పికప్‌ ట్రక్‌ దూసుకుపోవంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన అజ్మన్‌లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి, అజ్మన్‌లోని ఓ పెట్రోల్‌ స్టేషన్‌లో ఉన్న మెక్‌డోనాల్డ్స్‌ రెస్టారెంట్‌లోకి అదుపు తప్పిన పికప్‌ ట్రక్‌ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని షేక్‌ ఖలీఫా హాస్పిటల్‌కి తరలించామని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో ఇండియాకి చెందిన రెండు కుటుంబాలకు చెందినవారు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోల్ని ప్రచారం చేస్తే అది నేరపూరిత చర్యగా భావించబడుతుందని అజ్మన్‌ పోలీస్‌ డిప్యూటీ చీఫ్‌ కల్నల్‌ అబ్దుల్లా అల్‌ హమ్రాని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com